తరతరాలు గుర్తుండేలా అంబేద్కర్ స్మృతి వనం

by Anukaran |   ( Updated:2020-11-03 10:29:10.0  )
తరతరాలు గుర్తుండేలా అంబేద్కర్ స్మృతి వనం
X

దిశ, ఏపీ బ్యూరో: 125 అడుగుల ​అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం తరతరాల పాటు ప్రజల మదిలో శాశ్వతంగా నిల్చిపోయేట్లు రూపొందించాలని సీఎం ​జగన్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు, పార్కు అభివృద్ది మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం సమీక్షించారు. స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేసి అంబేద్కర్ ​జీవిత విశేషాలు ఆయన సూక్తులను ప్రదర్శించాలన్నారు. పార్కు వద్ద రహదారిని, ఫుట్​పాత్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విగ్రహం, స్మృతి వనానికి సంబంధించి అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకు వివరించారు. నాగపూర్‌లో ఉన్న అంబేద్కర్‌ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లక్నోలోని అంబేద్కర్‌ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను ఉదాహరణగా చూపారు. పనులు ప్రారంభమైన 14నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed