#2YearsForYSJaganAneNenu : రెండేళ్ల పాలనలో ఏం చేశారు.. అసలు విషయం చెప్పిన సీఎం జగన్

by Anukaran |   ( Updated:2021-05-30 02:10:20.0  )
#2YearsForYSJaganAneNenu : రెండేళ్ల పాలనలో ఏం చేశారు.. అసలు విషయం చెప్పిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 86 శాతం కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. ఇందులో భాగంగానే ప్రజలకు నేరుగా రూ. 95.528 కోట్లు, పథకాల ద్వారా 36.197 కోట్లు అందజేశామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94 శాతానికి పైగా పూర్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు.

ఇదే విషయంపై సీఎం జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ‘ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను. దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం’ అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.

Advertisement

Next Story

Most Viewed