- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతీ పంచాయతీకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్
దిశ, ఏపీబ్యూరో : ప్రతీ గ్రామ పంచాయతీకి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్సౌకర్యం అందించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఐటీ, డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం విధానం మరింత ముందుకొస్తుందని చెప్పారు. అందువల్ల ఏ ప్యాకేజీలో నైనా సరే అన్లిమిటెడ్ నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్భ లైన్లు వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. గ్రామాల్లోని ప్రతీ నెట్వర్క్పాయింట్లో డిజిటల్లైబ్రరీ సదుపాయం ఉండాలన్నారు. జగనన్న కాలనీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
అమ్మ ఒడి పథకానికి సంబంధించి వచ్చే ఏడాది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చే ఆప్షన్‌కు సిద్దం చేయాలని కోరారు. తొమ్మిదో తరగతి పైన చదివే విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాల కింద ఇచ్చే నగదుకు బదులుగా అవసరమైన స్పెసిఫికేషన్స్‌తో ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్‌లో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదా కొత్తది ఇచ్చేట్లు కంపెనీలతో మాట్లాడాలన్నారు. ల్యాప్‌టాప్‌లు ఇచ్చే కంపెనీ మెయింటినెన్స్‌ను ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్ శ్రీకాంత్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి, ఫైబర్‌నెట్ ఎండీ ఎం.మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.