- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వివేకా హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌ను విచారించాలి: పట్టాభి
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులోని ప్రధాన నిందితుడు శంకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సన్నిహితుడని పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో పట్టాభి మాట్లాడుతూ.. వివేకాను హత్య చేయడానికి పథకం వేసి ముందుండి నడిపించింది శంకర్‌రెడ్డేనని వ్యాఖ్యానించారు.
హత్య జరిగిన తర్వాత దస్తగిరి ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడని పట్టాభి ప్రశ్నించారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో శంకర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ జీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిలను విచారించాలని పట్టాభి డిమాండ్ చేశారు.
Advertisement
Next Story