రేపు హస్తినకు జగన్

by srinivas |
రేపు హస్తినకు జగన్
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జగన్ ఆకస్మిక హస్తిన పర్యటనకు కారణం రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కబరచడమని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా.. ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. పలు స్కీముల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు కోర్టులలో ఆయన నిర్ణయాలు తీవ్ర అభ్యంతరానికి గురవుతున్నాయి. దీనిపై ఆయన కేంద్రంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో చోటుచేసుకున్న వివాదాన్ని ఆయన కేంద్రానికి వివరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన పర్యటన, షెడ్యూల్‌పై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed