ఈసీపై జగన్ గుస్సా

by srinivas |

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా సీఎం జగన్ స్పందించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విచక్షణ కోల్పోయి ప్రవర్తించారని జగన్ అన్నారు. ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలన్నారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేస్తునే అధికారులను తప్పిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబు నియమించిన వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అని అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంద్రబాబు ఈసీ పదవిలోకి తెచ్చుకున్నారు అని సీఎం మండిపడ్డారు.

ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు సంప్రదింపులు చేయాలి కదా అని జగన్ ప్రశ్నించారు. కలెక్టర్లను బదిలీ చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఎవరో వస్తున్నారు.. ఎవరో రాస్తున్నారు.. ఇతను చదువుతున్నారు అంటూ ఎన్నికల కమిషనర్ పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమొదురు ఘటనలు జరిగాయని, పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని సీఎం అన్నారు. వైసీపీ ఎన్నికల్లో స్వీప్ చేస్తుందన్న కారణంతోనే ఎన్నికలను వాయిదా వేశారని జగన్ అన్నారు.

tag; cm jagan, election commission, fire, ap news

Advertisement

Next Story

Most Viewed