చంద్రబాబుకు అప్పుడే బీసీలు గుర్తొస్తారు : జగన్

by srinivas |
చంద్రబాబుకు అప్పుడే బీసీలు గుర్తొస్తారు : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై రచ్చ నడుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు సంధించగా.. సీఎం జగన్ అందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీ రిజర్వేషన్లు గుర్తొస్తాయని జగన్ మండిపడ్డారు. 2018లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చినా చంద్రబాబు వినిపించుకోలేదని గుర్తుచేశారు.

ఆనాడు ఎన్నికలు జరిగి ఉంటే బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వచ్చేవని వెల్లడించారు. అలాగే, ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయని తెలిసి రూ.2వేల పెన్షన్ పెంచారని విమర్శించారు. రిజర్వేషన్లపై తాము ఓ నిర్ణయం తీసుకునే సమయంలో టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డితో కేసు వేయించారన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు 59.89 శాతం రిజర్వేషన్లతో 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినట్లు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.

గత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.2,134కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని సైతం నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం మాత్రం వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి రూ.1900కోట్లు ఖర్చు చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed