ఎన్‌ కౌంటర్.. క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భగేల్

by Sridhar Babu |
ఎన్‌ కౌంటర్.. క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భగేల్
X

దిశప్రతినిధి, కరీంనగర్ : బీజాపూర్ ఎన్ కౌంటర్లో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కొద్దిసేపటి కిందట పరామర్శించారు. రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జవాన్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.

వీరోచితంగా పోరాడారు..

బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో జవాన్లు వీరోచితంగా పోరాడారని సీఎం భూపేష్ భగేల్ అన్నారు. ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 2,000 మంది బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయన్నారు. ఐదు బృందాల్లో ఒక టీమ్ మావోల చేతికి చిక్కిందన్నారు. నక్సల్స్ ఇలాఖాగా ఉన్న ఆ ప్రాంతంలో మావోలు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు జవాన్లు 4 గంటల పాటు పోరాటం చేశారన్నారు. ఈ ఘటనలో మావోయిస్టులు కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. మావోయిస్టులు తమ వాళ్లను నాలుగు ట్రాక్టర్లలో తరలించుకుపోయారంటే ఎంత నష్టపోయారో అర్థం చేసుకోవచ్చని సీఎం అన్నారు. మావోల ఏరివేత కోసం చేపట్టే ఆపరేషన్‌ను నిలిపివేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. ముందుకొచ్చి నక్సల్స్ పోరాటం చేయడం లేదన్నారు. ఇది ఇంటలీజెన్స్ వైఫల్యం ఏంత మాత్రం కాదన్నారు.

Advertisement

Next Story