- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్రపు బండిపై అసెంబ్లీకి అందుకే వెళ్లాం.. భట్టి క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో: శాంతియుతంగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరసన తెలుపుకున్న నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై వస్తుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. దీనికి స్పందిస్తూ గాంధీ భవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రవాణా వ్యవస్థ భరించలేని స్థితిలో ఉందని ప్రభుత్వానికి చెప్పడం కోసమే గుర్రపు బండిపై వెళ్లామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి ఏ విధంగా వెళ్లాలనేది సభ్యులుగా తమ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనాలను నడపలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అకారణంగా అరెస్ట్ చేయడంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.a