జహంగీర్ పీర్ దర్గా మూసివేత

by Shyam |   ( Updated:2021-05-12 05:45:25.0  )
జహంగీర్ పీర్ దర్గా మూసివేత
X

దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని పవిత్ర దర్గా హజరత్ జహంగీర్ పీర్ పుణ్యక్షేత్రాన్ని బుధవారం నుండి 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వల్ల జహంగీర్ పీర్ దర్గాలో పది రోజుల పాటు ఎలాంటి దర్శనాలకు అనుమతి ఉండదని నిర్వాహకులు పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇందుకు భక్తులు సహకరించాలని దర్గా నిర్వాహకులు కోరారు.

Advertisement

Next Story