నష్టమైనా తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకున్నాం !

by srinivas |   ( Updated:2020-10-23 06:02:19.0  )
నష్టమైనా తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకున్నాం !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణ కోరిన విధంగా 1.05లక్షల కిలోమీటర్లు తగ్గించుకున్నామని, ప్రతిపాదించిన రూట్లలో కూడా ఏపీ బస్సులను తక్కువ తిప్పేందుకే అంగీకరించామని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ విధించిన షరతులతో విజయవాడ- హైదరాబాద్ రూట్‌లో 350బస్సులు తిరిగే అవకాశం ఉందన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం చేకూరేలా ఉన్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒప్పుకున్నామని, దీంతో ఏడాదికి సుమారు రూ.265కోట్ల లాస్ వస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించాం కాబట్టి బస్సు సర్వీసులపై గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నామని, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఎక్కువ ఛార్జీలు వేయకుండా నిఘా ఉంచుతామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed