- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు కొలీజియం భేటీ.. సీజేఐ నిర్ణయంపై అసంతృప్తి
న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తుల నియామకం కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే గురువారం కొలీజియం భేటీకి పిలుపునిచ్చారు. సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నిర్ణయంపై ఇద్దరు సహన్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన తర్వాత ప్రస్తుత సీజేఐ జస్టిస్ బాబ్డే ఈ భేటికి పిలుపునివ్వడాన్ని ప్రశ్నించారు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌కు ముందే ఈ భేటీ షెడ్యూల్ నిర్ణయించడంతో వీరి అభిప్రాయాలను సీజేఐ ఎస్ఏ బాబ్డే పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రానికి సిఫారసులు చేసే కొలీజియంలో ఐదుగురు సభ్యులుంటారు. ప్రస్తుతం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణలతోపాటు న్యాయమూర్తులు రోహింటన్ నారిమన్, యూయూ లలిత్, ఏఎం ఖాన్విల్కార్‌లున్నారు.
సీజేఐగా సుమారు 14 నెలలుగా కొనసాగుతున్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రికమెండ్ చేయలేదు. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అఖిల్ ఖురేషీని సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడంపై సుదీర్ఘంగా వాయిదా పడుతూ వస్తున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులను నియమించుకునే అవసరం ఉంది. కానీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని కొలీజియం ఇప్పటి వరకు ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రానికి పంపలేదు. ఇదిలా ఉండగా, ఈ నెల 24న జస్టిస్ ఎస్ఏ బాబ్డే రిటైర్ కానున్నారు. ఆయనతోపాటు న్యాయమూర్తులు నారిమన్, నవిన్ సిన్హాలూ ఈ ఏడాదే రిటైర్ కాబోతున్నారు.