ఏమో.. ఆమె నిన్ను ప్రేమిస్తుందేమో.. కంగ్రాట్స్ : సీపీ

by Shamantha N |
Twitter
X

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ వేదికగా నిర్వహించే ‘ఆస్క్ మీ’లో ఓ యువ ప్రేమికుడు అడిగిన ప్రశ్నకు నగర సీపీ సమయ స్ఫూర్తితో, వినూత్నంగా చెప్పిన జవాబు వైరల్ అయింది. సెలబ్రెటీలు నెటిజెన్లతో మమేకం అయ్యేందుకు ట్విట్టర్ లోని ‘ఆస్క్ మీ’ని ఉపయోగించుకుంటారు. నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు జవాబు ఇస్తుంటారు. ఈ చర్చగోష్టి కొన్నిసార్లు వివాదాలు సైతం అయ్యాయి. హీరోయిన్లను అడిగే ప్రశ్నలు కొన్ని వివాదస్పదం అయ్యాయి. కాగా పూణె పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా ట్విట్టర్ వేదికగా ‘లెట్స్ టాక్ సీపీ పూణె సిటీ’ హ్యాష్ ట్యాగ్‌తో ‘ఆస్క్ మీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నెటిజెన్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సీపీకి.. ఓ యువకుడి నుంచి వినూత్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన అదే స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఇప్పుడా క్వచ్చన్, ఆన్‌సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీపీ ఇచ్చిన సమాధానానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఆయనను ప్రశంసల జల్లులో ముంచుత్తుతున్నారు. ఇంతకూ నెటిజెన్ క్వచ్ఛన్ ఏంటంటే.. ‘నేను ఓ యువతిని ప్రేమిస్తున్నాను. ఆమె నా ప్రేమను అంగీకరించడం లేదు. మీరు ఏదైన సహాయం చేయండి’ అని సీపీని కోరాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘దురదుష్టవశాత్తు ఆమె అంగీకారం లేకుండా మేము ఎలాంటి సహాయం లేయలేం. మీరు కూడా ఆమెకు ఇష్టం లేని పనులు చేయవద్దు. ఏమో.. ఏదో ఒకరోజు ఆమె మీ ప్రేమను అంగీకరించవచ్చు. అందుకు ముందుగానే మా తరుఫున మీకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం’ అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కి ‘నో మీమ్స్ నో’ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఇదే ట్వీట్ ప్రస్తుతం వైరలై యువతను ఆకర్షించింది.

Advertisement

Next Story

Most Viewed