Ghati: హీరోయిన్ అనుష్క కోసం తమిళ నటుడు.. పోస్టర్ రిలీజ్

by sudharani |   ( Updated:2025-01-15 13:44:17.0  )
Ghati: హీరోయిన్ అనుష్క కోసం తమిళ నటుడు.. పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’ (Ghati). ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ (Female oriented) సినిమాను డైరెక్టర్ క్రిష్ (Krish) తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నుంచి ఇప్పటికే అనుష్క ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో ‘ఘాటీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో వరుస అప్‌డేట్ ఇస్తున్నారు చిత్ర బృందం.

ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయన బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ (First look)ని విడుదల చేశారు. ఆయన దేసి రాజు (DesiRaju) అనే పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‌ (Glimpse release)ను విడుదల చేశారు. ఇందులో విక్రమ్ ప్రభు యాక్షన్ సీన్స్ (Action scenes) అదరగొట్టాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Next Story

Most Viewed