Pushpa-2:రేపే ‘పుష్ప-2’ రిలీజ్.. ఎట్టకేలకు స్పందించిన మెగా బ్రదర్!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-04 16:18:49.0  )
Pushpa-2:రేపే ‘పుష్ప-2’ రిలీజ్.. ఎట్టకేలకు స్పందించిన మెగా బ్రదర్!
X

దిశ,వెబ్‌డెస్క్: బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న పుష్ప–2(Pushpa 2) మూవీ రేపు(డిసెంబర్ 5) విడుదల కానుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌ను ఊపేస్తున్నాయి. కిస్సిక్, పీలింగ్స్ పాటలకు చిన్న, పెద్ద తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పుష్ప-2 రిలీజ్ ముందు ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ నుంచి స్పందన వచ్చింది. పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది స్పందించిన.. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్క ట్వీట్ కూడా రాలేదు. ఈ క్రమంలో తాజాగా.. రేపు పుష్ప-2 రిలీజ్ సందర్భంగా.. మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఆసక్తికర ట్వీట్ చేశారు. వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించే సినిమా విజయం కావాలని కోరుకుందామన్నారు. ‘అందరినీ అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు. కాగా, అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ఫైట్ జరుగుతున్న వేళ ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Read More...

Pushpa-2: పుష్ప-2 చిత్రానికి మరో BIG షాక్.. షోలు రద్దు



Advertisement

Next Story