- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘అనార్కలి’ సినిమాలో ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఫిక్స్.. వావ్ కాంబో అదిరిపోయిందిగా! (ట్వీట్)

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్స్ మమిత బైజు(Mamita Baiju), కయ్యదు లోహర్(Kayadu Lohar ) స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ క్రేజీ హీరోయిన్స్‌గా మారిపోయారు. అనతి కాలంలోనే వీరిద్దరు ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. లోహర్ ‘డ్రాగన్’(Dragon) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం లోహర్, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమాలో నటిస్తున్నట్లు టాక్. ఇక మమిత విషయానికొస్తే.. ఈ అమ్మడు ‘ప్రేమలు’ చిత్రంలో నటించి తన నటనతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.
దీంతో మమితకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రజెంట్ ఈ భామ ప్రేమలు-2, జన నాయగన్(Jana Nayagan), డియర్ కృష్ణ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఓ తెలుగు ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఈ భామలు హీరోయిన్స్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘అనార్కలి’ పేరుతో రాబోతున్న ఈ సినిమాను కిశోర్ తిరుమల తెరకెక్కిస్తుండగా.. ఎస్‌విఎస్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కయద్, మమితకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వావ్ కాంబో అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.