రష్మిక మందన్న ఫేవరెట్ సాంగ్స్ ఆ రెండే..

by sudharani |   ( Updated:2024-11-15 15:52:49.0  )
రష్మిక మందన్న ఫేవరెట్ సాంగ్స్ ఆ రెండే..
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ‘పుష్ప’ (Pushpa)సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ బ్యూటీ ప్రజెంట్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలు ‘కుబేర’(Kubhera), ‘పుష్ప-2’(Pushpa-2). ఇందులో పుష్ప-2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ సమయం దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ ఫోగ్రమ్‌కు హాజరైన రష్మిక తన ఫేవరేట్ సాంగ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా లైఫ్‌లో నా కెరీర్‌లో నా టూ ఫేవరెట్ సాంగ్స్ ‘కదలల్లే, శ్రీవల్లి’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ కూడా ఈ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ 10 లో ఒకటిగా వైరల్ అవుతోంది.


Read More..

Vijay Devarakonda: వచ్చేసిన విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్ ఫుల్ వీడియో


Advertisement

Next Story

Most Viewed