- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kannappa: ‘కన్నప్ప’ నుంచి శివుడి పాత్రను రివీల్ చేసి బిగ్ షాకిచ్చిన మేకర్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్

దిశ, సినిమా: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’(Kannappa) సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ సైతం ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ అంతా ఊహించని విధంగా ఉండబోతున్నట్లు అంచనాలను పెంచుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ‘కన్నప్ప’(Kannappa) మూవీని అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25 గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే.. తాజాగా, ‘కన్నప్ప’ చిత్రం నుంచి స్టార్ హీరో ఫస్ట్ లుక్(First Look)ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్(Akshay Kumar) ముల్లోకాలను ఏలే పరమశివుడి పాత్రల్లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. ఇక ఇందులో ఆయన ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు పరమశివుడిగా ప్రభాస్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అంతా శివుడిగా ఎలా ఉంటారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్షయ్ పోస్టర్ రిలీజ్ చేయడంతో షాక్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్లు అంటున్నారు.