Sreeleela: అక్కినేని బ్రదర్స్ తో శ్రీలీల.. ఈ కాంబినేషన్స్ ఎవరు ఊహించలేదుగా..!

by Prasanna |
Sreeleela: అక్కినేని బ్రదర్స్ తో శ్రీలీల.. ఈ కాంబినేషన్స్ ఎవరు ఊహించలేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : “పెళ్లి సందD” మూవీతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అయిన శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం దూసుకెళ్తుంది. మొదటి సినిమాతోనే ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు వేపించుకుంది.ఆ తర్వాత రవితేజతో “ధమాకా” (Dhamaka) మూవీలో నటించి సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, వరుస అవకాశాలను చేసుకుంటూ వెళ్తుంది.

యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన “గుంటూరు కారం”లో (Guntur Kaaram) శ్రీలీలకు, సినిమ నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు, ఆమె వరుస సినిమాలుతో బిజీగా మారింది. వాటిలో క్రేజీ ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. తాజాగా, అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మనే ఓకే చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఇంకో వైపు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా రాబోతున్న కొత్త ప్రాజెక్ట్‌లో కూడా శ్రీలీలను సెలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తుంది. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed