- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగా అభిమానులకు సారీ .. దీన్ని ఇక్కడితో వదిలేయండి: Allu Aravind

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. దీని వలన ఏ చిన్న వీడియో వచ్చినా తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా " తండేల్ " ( Thandel ) ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ హీరో రామ్ చరణ్ ను తగ్గించి మాట్లాడారంటూ ఆయన పై వస్తున్న ట్రోలింగ్ పై అల్లు అరవింద్ ( Allu Aravind ) స్పందించారు.
రామ్ చరణ్‌ను ( Ram Charan ) తగ్గించి మాట్లాడారని .. అదే పనిగా ట్రోలర్స్ ట్రోల్ చేశారని, తాను అయితే ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని అన్నారు. మెగా ఫ్యాన్స్ తనను తప్పుగా అర్థం చేసుకుని, ట్రోల్ చేశారని చెప్పారు.
" రామ్ చరణ్ ( Ram Charan ), తనకు మధ్య మంచి బాండింగ్ ఉందని, ఈ మధ్య తండేల్ ఈవెంట్లో రామ్ చరణ్ తాను తగ్గించానంటూ ఒకటే పనిగా ట్రోల్ చేశారు. చరణ్ తనకు ఒక్కగానొక్క మేనల్లుడని, అలాగే చరణ్‌కు తాను ఏకైక మామనని అని చెప్పారు. ఇక, ఇక్కడితో ఆ టాపిక్ వదిలేయమని కోరారు. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడలేదు. ఎవరైనా ఫీల్ అయితే క్షేమించండి.. సారీ అని చెప్పారు. రీసెంట్ గా, తండేల్ ఈవెంట్లో తాను మాట్లాడుతున్న సమయంలో చరణ్ ను తక్కువ చేసి కామెంట్స్ చేశారని ఓ మీడియా ప్రతినిధి అల్లు అరవింద్ కు గుర్తు చేశారు. వాటి గురించే ఇప్పుడు తాను రియాక్ట్ అవుతున్నా అని తెలిపారు. తన కొడుకు ఎలాగో రామ్ చరణ్ కూడా అంతే, "తండేల్ " ఈవెంట్‌లో దీని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని , అప్పుడు నో కామెంట్స్ అని చెప్పా " అంటూ ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.