వరుణ్ వెడ్డింగ్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2023-11-03 13:50:25.0  )
వరుణ్ వెడ్డింగ్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్-లావణ్య పెళ్లి ఇటలీలోని టుస్కానియాలో నవంబర్ 1న జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీ పలువురు ప్రముఖులు ఇటలీకి వెళ్లారు. గ్రాండ్‌గా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను జరిపించారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లుక్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి.

తాజాగా, రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ధరపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ పెటల్ ఫిలిప్స్ మోడల్.. దాని ఖరీదు 2,85000 డాలర్స్ అని ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇండియన్ కరెన్సీలో రూ. 2 కోట్ల 85 లక్షల ఖరీదు అని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీతో త్వరలో రాబోతున్నాడు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ కోసం డైరెక్టర్ శంకర్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఒక్క పాటకే రూ. 16 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో విడుదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed