Rashmika Mandanna: ఆ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసి అలాంటి పని చేసిన రష్మిక.. అసలేం జరిగిందంటే?

by Hamsa |   ( Updated:2025-02-12 08:10:07.0  )
Rashmika Mandanna: ఆ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసి అలాంటి పని చేసిన రష్మిక.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల రష్మిక ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై చరిత్ర సృష్టించింది. అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇదే ఫామ్‌తో రష్మిక హిందీ, తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘చావా’(Chhaava) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మోస్ట్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మరాఠా కింగ్ చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా థియేటర్స్‌లోకి రానుంది. ఈ క్రమంలోనే.. రష్మికకు జిమ్‌లో గాయం అవడంతో ఆమె ప్రమోషన్స్‌కు దూరం అయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులు పెడుతూ తాను రాలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లు తెలుపుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘చావా’ మూవీ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ ఫన్నీ పోస్ట్ పెట్టింది. ‘‘లక్ష్మణ్ సార్ ఎడిటింగ్, సీరియస్ సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేను విక్కీ కలిసి అతనిని కిడ్నాప్ చేసి మినీ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము. ఫైనల్లీ అనుకున్నది జరిగింది’’ అనే క్యాప్షన్ జత చేసి ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో ఎల్లో డ్రెస్ ధరించిన రష్మిక ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన కొందరు నడవలేని పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేస్తున్నావు.. నీ గాయం ఏమైంది అని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం ఫొటో కోసం అతని పనిని డిస్టబ్ చేసావా అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed