- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ramana Gogula: 18 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం సాంగ్ పాడిన రమణగోగుల.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఈ సినిమాకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు(Dilraju), శిరీష్(Shirish) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గోదారి గట్టు మీద రామ చిలకవే.. గోరింటాకెట్టుకున్న చందమామవే అంటూ సాగే ఈ పాటకు భాస్కర్ భట్ల(Bhaskar Batla) సాహిత్యం అందించారు. అయితే సుమారు 18 ఏళ్ల తర్వాత రమణ గోగుల(Ramana Gogula) హీరో వెంకటేష్ కోసం ఈ పాటను ఆలపించడం విశేషం. అయితే రమణ గోగుల ఫస్ట్ సాంగ్ పాడిన సినిమాలో కూడా హీరో వెంకీనే కావడం గమనార్హం. ఇక ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ(Madhu Priya) కూడా చాలా అద్భుతంగా పాడింది. కాగా భీమ్స్ సిసిరోలియో(Bheems Sisiri Leo) సంగీతం అందించారు.