- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Court trailer : కోర్ట్ ట్రైలర్ వచ్చేసింది.. బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్ అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’ (Court). ఇందులో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శివాజీ (Shivaji), సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఉగాది కానుకగా మార్చి 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగా నేడు కోర్ట్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో పాటు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre release event)ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇక ట్రైలర్ (Trailer) విషయానికి వస్తే.. తన కూతురితో ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి (శివాజీ) ఆ కుర్రాడిపై కక్ష కట్టి కేసు పెడతాడు. అంతే కాకుండా అమ్మాయిలకు సంబంధించిన అన్ని సెక్షన్ల మీద అతడిపై కేసులు పెట్టడమే కాకుండా ఏకంగా పోక్సో కేసు కూడా బనాయిస్తాడు. ఇక బెయిల్ కూడా రాకపోవడంతో ఆ కుర్రాడు జైల్లో అలా 78 రోజులు మగ్గుతాడు. పోక్సో కేసు కావడంతో ఎవరూ వాదించడానికి ముందుకు రాడు. దీంతో ప్రియదర్శి ఆ కేసును వాదించడానికి వస్తాడు. మొత్తం కోర్ట్ ట్రైలర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ప్రజెంట్ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘సోసైటీకి ఇప్పుడు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం అని’, ‘ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.