సినిమాల్లోకి రాకముందే ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించిన పవన్ కల్యాణ్..?

by Hamsa |   ( Updated:2023-08-11 09:26:41.0  )
సినిమాల్లోకి రాకముందే ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించిన పవన్ కల్యాణ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు సినిమా షూటింగ్‌లను పూర్తి చేస్తున్నారు. అయితే నిత్యం సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల బ్రో సినిమాలో పలు డైలాగ్స్ తనను ఉద్దేశించే పెట్టారని రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సినిమా తీస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడని తెలుస్తోంది. చిరంజీవి స్టార్ హీరోగా ఉన్న సమయంలో అన్నతో కలిసి పవన్ చెన్నైలో ఉండేవాడట. చదువుకునే రోజుల్లో కంప్యూటర్ క్లాసులకు వెళ్లేవాడు.. అయితే ఆ కంప్యూటర్ క్లాస్ లో ఒక అందమైన అమ్మాయి ఉండేదట. అమ్మాయిని చూసి అక్కడ ఉన్న మగవాళ్ళందరూ ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నించేవారట.. కానీ ఆమె మాత్రం కేవలం పవన్ కల్యాణ్ తోనే నవ్వుతూ మాట్లాడేదట. దీంతో కొన్ని రోజుల తర్వాత పవన్‌ ఆమెనుప్రేమించాడట. ఒక రోజు తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి బయటకు కూడా తీసుకెళ్లాడట. అప్పుడు ఆ అమ్మాయి కోపంతో నీ వయసు ఏంటి నా వయసు ఏంటి? అంటూ ఆయనను తిట్టి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇక దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిస్తేనే ఈ రూమర్స్‌కు చెక్ పడేలా కనిపిస్తోంది.

Read More: ‘భోళా శంకర్’ పర్‌ఫెక్ట్ రివ్యూ.. (వీడియో)

Advertisement

Next Story