Pawan Kalyan: హరిహర వీరమల్లు కేవలం సినిమా కాదు.. కొండంత హైప్ పెంచిన జనసేన నేత

by sudharani |   ( Updated:2024-12-03 16:26:16.0  )
Pawan Kalyan: హరిహర వీరమల్లు కేవలం సినిమా కాదు.. కొండంత హైప్ పెంచిన జనసేన నేత
X

దిశ, సినిమా: AP డిప్యూటీ సీఎం (Deputy CM), పవర్ స్టార్ పవన్ కల్యాన్ (Power Star Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ (Most Prestigious Project) ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu). పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఎమ్ రత్నం (AM Ratnam) నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ (Bobby Deol) విలన్‌గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే.. పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా కంప్లీట్ చేసేందుకు తాజాగా పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ పవర్ స్టార్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ‘హెవీ రాజకీయ షెడ్యూల్ తర్వాత నేను చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ కోసం నా సమయాన్ని కొన్ని గంటలు ఇవ్వగలను!’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేసిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolishetty Satyanarayana).. ‘‘హరిహర వీరమల్లు’ కేవలం సినిమా కాదు.. ధర్మం, సనాతన ధర్మం గురించి ప్రజలను ఆలోచించేలా చేసే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోయే చిత్రం.. బహుశా జరిగిన ఆలస్యం హరిహర వీరమల్లు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడానికేనని మా నమ్మకం’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read More...

Pawan Kalyan: హరిహరవీరమల్లు షూటింగ్ నుంచి వీడియో లీక్.. అదిరిపోయిన పవర్‌స్టార్ మీసం మెలేస్తున్న విజువ‌ల్స్


Advertisement

Next Story

Most Viewed