- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Anil Ravipudi: ఆ హీరోయిన్ చాలా టార్చర్ పెట్టిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి
దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్ ( victory venkatesh) హీరోగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా " సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunnam) . ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే, సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. భీమ్స్ మ్యూజిక్ ను అందించిన ఈ మూవీలో వెంకీకి జోడిగా ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలగా నటిస్తున్నారు. సోమవారం రాత్రి నిజామాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ " దిల్ రాజు, శిరీష్ నాకు మంచి స్నేహితులు. వాళ్ళతో ఇది నాకు ఆరో సినిమా. నేను ఏది కావాలని చెప్పినా నో అనకుండా చాలా చాలా సపోర్ట్ గా ఉంటారు. ఈ మూవీ .. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. పండుగ రోజు అందరూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. మూవీలో వెంకటేశ్ భార్యలా నటించిన ఐశ్వర్య రాజేశ్ ( Aishwarya Rajesh) ఆయన్ను చాలా చాలా టార్చర్ పెట్టింది. ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలు షార్ట్స్ పడుతూనే ఉంటాయి. ఎక్స్ లవర్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా మీనాక్షి చౌదరి అదిరిపోయే యాక్టింగ్ చేసింది. విక్టరీ వెంకటేశ్ గురించి నా నోటి నుంచే వచ్చే ఒకటే మాట.. మా వెంకీ మామ, సినిమా కోసం ఏదైనా చేస్తారు. ఆయన తన కెరీర్ లో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని" ఆయన మాటల్లో చెప్పారు.