- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మళ్లీ చిక్కుల్లో 'ఆర్ఆర్ఆర్'.. రిలీజ్‌పై సందేహాలు..??
దిశ, వెబ్‌డెస్క్: 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీ తాజాగా రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసుకుంది. 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు మేకర్స్ మూవీ రిలీజ్ విషయంలో డైలమాలో పడినట్లు కనిపిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలు ఎక్జామ్స్ ఉండటంతో దాదాపు కుర్రకారు అంతా తమ పరీక్షలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఈ సమయంలో 'ఆర్ఆర్ఆర్' విడుదలైనా ప్రేక్షకులు తక్కువ మంది వస్తారేమో అని, కలెక్షన్లు అనుకున్నతంగా ఉండవేమో అని ఆలోచిస్తున్నారట. దానికి తోడు ఐపీఎల్ కూడా దగ్గర పడుతుంది. ఈ సారి 10 జట్లతో ఐపీఎల్ మరింత ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఇవన్నీ మూవీ బిజినెస్‌పై తప్పక ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు. మరి 'ఆర్ఆర్ఆర్' మూవీ విషయంలో మేకర్స్ ఏం ఆలోచన చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొని 'ఆర్ఆర్ఆర్' బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.