ఆ హీరోయిన్ కారణంగానే నాగచైతన్య-శోభిత విడిపోయారా?

by Hamsa |
ఆ హీరోయిన్ కారణంగానే నాగచైతన్య-శోభిత విడిపోయారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఏమాయ చేసావే సినిమాతో ప్రేమించుకున్నారు. 2017లో అక్టోబర్ 6న పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం కొద్ది కాలంపాటు సంతోషంగా సాగినప్పటికీ ఏవో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. చై వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ సమంత మాత్రం మయోసైటీస్ వ్యాధి కారణంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. వైద్యం తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుటుంది.

ఇక నాగచైతన్య, సామ్‌తో విడిపోయినప్పటి నుంచి హీరోయిన్ శోభితా దూళిపాలతో రిలేషన్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలం నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చై, శోభితా ఓ హోటల్‌లో దగ్గరగా నిల్చొని దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో అంతా ఆశ్చర్యపోయారు వీరిద్దరు నిజంగా ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. అలాగే పెళ్లి కూడా చేసుకుంటారని ఫిక్స్ అయిపోయారు. దీనిపై వారు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య, శోభితా విడిపోవడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అనే వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

చై తల్లి నాగార్జున రెండో భార్య అమల కాబోయే కోడళ్లకు కండీషన్స్ పెడుతుందట. వాటిని పాటిస్తేనే పెళ్లి వరకు వెళ్లనిస్తుందట. ఆ విషయం శోభితకు తెలియడంతో చైతుతో విడిపోయి ముంబైలో మరొక అబ్బాయిని ప్రేమించిందట. అంతేకాకుండా చెట్టపట్టాలేసుకుని తిరుగుతుందట. అసలు ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. సమంత కూడా అందుకే నాగచైతన్యను విడాకులు కోరినట్లుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.




Advertisement

Next Story