Siva Karthikeyan: ‘పరాశక్తి’ సినిమాలో సెన్సేషనల్ స్టార్.. మూవీపై హైప్ పెంచేస్తున్న మాలీవుడ్ హీరో ఎంట్రీ

by sudharani |
Siva Karthikeyan: ‘పరాశక్తి’ సినిమాలో సెన్సేషనల్ స్టార్.. మూవీపై హైప్ పెంచేస్తున్న మాలీవుడ్ హీరో ఎంట్రీ
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ప్రస్తుతం ‘SK-25’తో బిజీగా ఉన్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘పరాశక్తి’ (Parashakti) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో జయం రవి, అతర్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్, తిరుచిరాపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పుటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ప్రాజెక్టులో మాలీవుడ్ (Mollywood) సెన్సేషనల్ స్టార్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph) భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతే కాకుండా.. ఆయన నటించిన మూవీస్ తెలుగులో రిలీజ్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఈ యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ ‘పరాశక్తి’ సినిమాలో నటించబోతున్నాడు అనే వార్తలు నెట్టింట వైరల్ కావడంతో.. శివ కార్తికేయన్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కాగా.. ఈ వార్తలే నిజం అయితే.. ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాసిల్‌కు ఇక వరుస పాన్ ఇండియా (Pan India) ఆఫర్స్ రావడం పక్కా అని చెప్పుకోవచ్చు.

Next Story

Most Viewed