ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి!

by Nagaya |   ( Updated:2023-09-11 04:30:06.0  )
ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే మెగా కోడలుగా వెళ్తుంది కాబట్టి ఆమె ఆచి తూచి అడుగులు వేస్తుందట. వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కొన్ని సినిమాలను రద్దు చేసుకుందట.

తాజాగా, లావణ్య సినిమాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ్‌లో ఓ వెబ్‌సిరీస్ చేయాలని లావణ్య ఒప్పుకుందట. దీనికి విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లావణ్య ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే ఇందులో కథానాయిక పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుందట అలాగే రొమాన్స్ సీన్స్ ఉంటాయని తెలిసి లావణ్య నో చెప్పిందని సమాచారం. కొద్ది రోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి వాటిల్లో నటించడం కరెక్ట్ కాదని ఈ అమ్మడు నిర్ణయించుకుందట. ఆ చిత్ర యూనిట్‌ని ఇంటికి పిలిపించి మరీ మరొక హీరోయిన్‌ను చూసుకోమని చెప్పిందట. అంతేకాకుండా ముందుగా తీసుకున్న అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చేసిందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ లావణ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story