Manchu Lakshmi: ఫ్యామిలీలో గొడవ.. నెట్టింట దుమారం రేపుతున్న మంచు లక్ష్మి మరో పోస్ట్

by Kavitha |
Manchu Lakshmi: ఫ్యామిలీలో గొడవ.. నెట్టింట దుమారం రేపుతున్న మంచు లక్ష్మి మరో పోస్ట్
X

దిశ, సినిమా: గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో జ‌రుగుతున్న గొడ‌వ టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక మంగ‌ళ‌వారం రాత్రి మోహన్ బాబు చిన్న కొడుకు మ‌నోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా గేటు వ‌ద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మ‌నోజ్‌ బ‌ల‌వంతంగా గేటు తెరిచి లోప‌లికి వెళ్లగా కొద్ది సేప‌టిలోనే చిరిగిన చొక్కాతో, బటన్స్ అన్ని ఊడిపోయి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఘ‌ట‌నను క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బంది పై మోహ‌న్ బాబు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ మీడియా ప్ర‌తినిధికి గాయాలు అయినాయి. దీంతో మోహ‌న్‌బాబు పై కేసు కూడా న‌మోదైంది. మ‌రోవైపు మోహ‌న్ బాబు అస్వస్థతతో గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ ఆస్పత్రిలో చేరారు.

ఇలా మంచు ఫ్యామిలీలో ఎన్నో ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మీ మాత్రం ఏం పట్టనట్టు.. బుధవారం తన కూతురు వీడియో షేర్ చేసి ‘పీస్’ అనే క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ఈ క్రమంలో ఈ రోజు మరోసారి మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ సోషల్ మాడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed