Complaint: జర్నలిస్టుపై దాడి కేసులో కీలక పరిణామం.. మంచు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు

by Shiva |
Complaint: జర్నలిస్టుపై దాడి కేసులో కీలక పరిణామం..  మంచు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు
X

దిశ, వెబ్‌‌డెస్క్: జర్నలిస్ట్‌ (Journalist)పై నటుడు మోహన్ బాబు (Mohan Babu) దాడి చేసిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మోహన్ బాబుతో పాటు ఇద్దరు కుమారులు విష్ణు (Vishnu), మనోజ్‌ (Manoj)లపై వెంటనే పోలీసులు క్రిమినల్ కేసులు (Criminal Cases) నమోదు చేయాలంటూ తాజాగా హైకోర్టు (High Court) అడ్వొకేట్ అరుణ్ కుమార్ (Arun Kumar) ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులను మనోజ్ (Manoj) తమ ఇంట్లోకి తీసుకెళ్లడం వల్లే దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయనపై పహాడీ షరీఫ్ (Pahadi Sharif) పోలీసులు BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే, బుధవారం మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందు పెట్టిన సెక్షన్‌ను మార్చేశారు.

Advertisement

Next Story

Most Viewed