- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alimony : భరణం నిర్ణయించడానికి సుప్రీంకోర్టు 8 మార్గదర్శకాలు
దిశ, నేషనల్ బ్యూరో : విడాకుల కేసుల్లో మహిళలకు భరణం(Alimony)గా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది పాయింట్ల ఫార్ములాను సుప్రీంకోర్టు(Supreme Court) నిర్దేశించింది. దేశంలోని కోర్టులు భరణాన్ని నిర్ణయించే క్రమంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజూ జైన్ విడాకుల కేసులో తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న వి వరలేలతో కూడిన ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
భరణాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది మార్గదర్శకాలివీ..
1. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి.
2. భవిష్యత్తులో భార్యా, పిల్లల ప్రాథమిక అవసరాలపై అంచనాకు రావాలి.
3. రెండు పార్టీల విద్యార్హతలు, ఉద్యోగ వివరాలను తెలుసుకోవాలి.
4. భార్యాభర్తల ఆదాయం, ఆస్తుల మూలాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
5. భార్య తన అత్తమామల ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె జీవన ప్రమాణం ఎలా ఉండేదో తెలుసుకోవాలి.
6. కుటుంబ పోషణ కోసం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందా అనే సమాచారాన్ని తెలుసుకోవాలి.
7. ఉద్యోగం చేయని భార్య కోసం.. న్యాయ పోరాటానికి అవసరమైన డబ్బును అందించాలి.
8. భర్త ఆర్థిక స్థితి, అతడి సంపాదన, భరణం కలుపుకొని అతడి మొత్తం నెలవారీ/వార్షిక వ్యయాలు ఎంత వరకు అవుతాయనేది అంచనా వేయాలి.
ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ విడాకుల కేసులో..
ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ విడాకుల కేసు విషయానికి వస్తే.. ఈ జంట పెళ్లయిన తర్వాత ఆరేళ్లు కలిసి జీవించింది. ఆ తర్వాతి 20 ఏళ్లు విడివిడిగా గడిపారు. సుదీర్ఘకాలంగా విడివిడిగా జీవిస్తున్న ఈ జంటకు తమ వైవాహిక బాధ్యతలను నెరవేర్చుకునే అవకాశం లభించలేదు. ఈ దృష్ట్యా వారి వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని కోర్టు విశ్వసించింది. తన పట్ల ప్రవీణ్ ప్రవర్తన సరిగ్గా లేదని అంజు ఆరోపించింది.ఈ అంశాల ప్రాతిపదికన వారికి విడాకులను మంజూరు చేసింది. భార్యకు రూ.5 కోట్ల భరణం చెల్లించాలని ప్రవీణ్ కుమార్ జైన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ప్రవీణ్ కుమార్ జైన్ కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం రూ.1 కోటిని కేటాయించాలని నిర్దేశించింది.
భరణం వ్యవహారం.. బెంగళూరు టెకీ సూసైడ్
భార్య నికిత వేధిస్తోంది అంటూ అతుల్ సుభాష్ అనే 34 ఏళ్ల బెంగళూరు టెకీ డిసెంబర్ 9న ఆత్మహత్య చేసుకున్నాడు. తన అపార్ట్‌మెంట్‌లో అతడు శవమై కనిపించాడు. భార్య, అత్తమామలపై ఆరోపణలు చేస్తూ అతడు రాసిన 24 పేజీల సూసైడ్ నోట్, తీసిన 1.5 గంటల వీడియో యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి. భార్య నికిత తనపై వరకట్న డిమాండ్లు, అసహజ సెక్స్, హత్య వంటి ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టిందని సూసైడ్ నోట్‌లో అతుల్ సుభాష్ ప్రస్తావించాడు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో తన భార్యతో అతుల్ సుదీర్ఘ న్యాయపోరాటం చేశాడు. తన భార్య భారీగా భరణాన్ని డిమాండ్ చేసిందని అతడు ఆరోపించాడు.