- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మెగా కోడలు..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున, నాగచైతన్య, శిరీష్, వరుణ్, నాని, సందీప్ కిషన్, విష్ణు వంటి హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో ప్రేమలో పడిపోయింది. ఇక ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. నవంబర్1న ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని మెగా కోడలుగా అడుగుపెట్టింది. ఇటలీలో పెళ్లి అయిపోగానే హైదరాబాద్‌లోని మెగా ఇంటికి చేరుకుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
తాజాగా, ఈ అమ్మడు సినిమా విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతోంది. లావణ్య ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలే తీయాలని అనుకుంటుందట. ఏ హీరోతో చేసినా రొమాన్స్ సీన్స్ ఉంటాయి కాబట్టి దాని వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోతుందని ఆలోచిస్తుందట. మెగా ఫ్యామిలీ ఎలాంటి కండీషన్లు పెట్టకపోయినా కోడలుగా పరువు పెంచే పాత్రలు మాత్రమే చేయాలనుకుంటుందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లావణ్యకు మరింత కలిసి రావాలని అనుకుంటున్నారు. ఇక వరుణ్-లావణ్యల రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుంది.
Read More..
పెళ్లి చీరతో ప్రేమను వ్యక్త పరిచిన లావణ్య.. మెగా కోడలిపై నెట్టింట ప్రశంసలు