Kiran Abbavaram: టాలీవుడ్ సీనియర్ హీరోపై కిరణ్ అబ్బవరం కామెంట్స్

by Anjali |
Kiran Abbavaram: టాలీవుడ్ సీనియర్ హీరోపై కిరణ్ అబ్బవరం కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) విభిన్న కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. సినీ ప్రజల్ని అలరిస్తున్నాడు. ఇటీవలే ఈ నటుడు నటించిన క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం.. అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా నటించిన బచ్చలమల్లి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కు రావడం చాలా హ్యాపీగా ఉందని తెలిపాడు. బచ్చలమల్లి(Bacchalamalli) మూవీ ప్రొడ్యూసర్‌తో కొంతకాలంగా జర్నీ చేస్తున్నానని.. ఈయన సినిమాపై ఫ్యాషన్ ఉన్న పర్సన్ అని వెల్లడించాడు.

అలాగే సినీ సెలబ్రిటీల్లో నేను మొదటిసారిగా కలిసింది సీనియర్ నటుడు అల్లరి నరేష్ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆయనతో భాగమవ్వడం నిజంగా ఆనందంగా ఉందన్నాడు. ఈ మూవీ తప్పకుండా హిట్ కొడుతుందని.. కానీ అనేక డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో నటించి ప్రజల్ని మెప్పించిన అల్లరి నరేష్ అన్నకు స్టార్ ట్యాక్ ఎందుకు రాలేదని సుబ్బు అన్నని అడిగానని అన్నాడు. ఒక నటుడిగా అన్ని పాత్రల్లో నటించడం కష్టమని.. అన్నకు ఇష్టముందో లేదో నాకు తెలియదుకు కానీ స్టార్ ట్యాగ్ ఇవ్వాలని ఫ్యాన్స్ గా మాత్రం నేను కోరుకుంటున్నానని తెలిపాడు. అలాగే బచ్చలమల్లి ట్రైలర్(Bachalamalli trailer) బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed