- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthi Suresh: 'కల్కి'లో ఆ పాత్ర చేయడానికి నేను తిరస్కరించా.. కీర్తి సురేశ్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయానికి వస్తే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తటిల్‌తో డిసెంబర్ 11,12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)’ వేడుకల్లో కీర్తి సురేష్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. "కల్కి ‘2898 ఏడీ’ సినిమాలో నన్ను అడిగిన పాత్రను తిరస్కరించినప్పటికీ నాగ్ అశ్విన్ ఏదో ఒక రకంగా ఆ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేస్తాడని నమ్మాను. నేను అనుకున్నట్లుగానే బుజ్జి పాత్రకు (ప్రభాస్ వాడిన కారు పేరు) నాతో డబ్బింగ్ చెప్పించాడు. బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఎలా చేరువ అవుతావు అని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగ్ అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. సినిమా విడుదల తర్వాత చాలా మంది బుజ్జి కారుకు నీ డబ్బింగ్ ప్లస్ అయింది అని నాతో అనడం ఆనందాన్నిచ్చింది" అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.