- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్- లావణ్య పెళ్లికి ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణం అదేనా?
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్-లావణ్య పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సన్నిహితులు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ తప్ప ఎక్కువ మంది పోలేదు. ఈ పెళ్లి హైదరబాద్‌లో జరిగి ఉంటే.. మాత్రం జనాలంతా మెగా ఇంట్లోనే ఉండేవారు. ఈ వేడుక ఇటలీలో జరగడంతో ఎక్కువ మంది హాజరు కాలేదు. ఇక పోతే వరుణ్-లావణ్య పెళ్లికి ప్రత్యేకంగా కొంత మంది గెస్టులను పిలిచారట. అందులో రేణు దేశాయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇండస్ట్రీలోని పలువురికి ఆహ్వానం అందినా వెళ్లలేదట. వారిని స్వయంగా వరుణ్-లావణ్య వెళ్లి మరీ పిలిచారట.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఎన్టీఆర్ ఇటలీకి వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ గోకర్ణ వెళ్లాడట. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. కాబట్టి ఆయన లేకపోతే షూటింగ్‌కు ఆటంకం కలుగుతుందని వెళ్లలేదట. కానీ వరుణ్ రిసెప్షన్ వరకు షూటింగ్ పూర్తి చేసుకుని హాజరయ్యేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే.. నవంబర్ 5 వరకు ఆగాల్సిందే. కాగా వరుణ్-లావణ్య రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరనుంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ హాజరు కానున్నట్లు సమాచారం.
Read More..
వరుణ్ తేజ్- లావణ్య పెళ్లిలో అల్లు అరవింద్ మిస్సింగ్.. రాకపోవడానికి కారణాలివేనా?