అతనికి థాంక్స్ చెబుతూ అక్కినేని కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నాగ చైతన్య రియాక్షన్ ఇదే

by Kavitha |   ( Updated:2024-12-30 04:21:30.0  )
అతనికి థాంక్స్ చెబుతూ అక్కినేని కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నాగ చైతన్య రియాక్షన్ ఇదే
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నాళ్లు అక్కినేని నాగ చైతన్యతో డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మడు.. రీసెంట్‌గా చైని పెళ్లి కూడా చేసకుంది. ప్రస్తుతం అక్కినేని కోడలు స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శోభిత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

అందులో ఏఎన్నార్(ANR), ప్రధానమంత్రి మోదీ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘గౌరవనీయులైన మోదీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కొరకు వారి కృషికి అభినందనలు మీ వంటి గొప్ప నాయకుడి నుండి పొందడం మా అదృష్టం. హృదయ పూర్వక ధన్యవాదములు’ అంటూ నమస్కారం చేస్తున్న ఎమోజీని జోడించింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నాగ చైతన్య లైక్ కొట్టడమే కాకుండా రీపోస్ట్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు అబ్బో ఇప్పటి నుంచే అక్కినేని కోడలుగా మంచి పేరు తెచ్చుకోవడానికి బాగా ట్రై చేస్తుందని ఒకరు అంటుంటే, అది అవ్వదమ్మా అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు విషయాలు పంచుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజా ఏపిసోడ్‌లో ప్రధాని.. ఏఎన్నార్‌ని గుర్తు చేసుకుంటూ కొనియాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘అక్కినేని.. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed