- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ క్యూటీస్ అన్నింటిని నాతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని ఉంది.. మెగా కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత రీసెంట్‌గా మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలకు దూరం ఉంటూ సోషల్ మీడియాకే పరిమితం అయింది. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వేకేషన్స్‌కి వెళ్లిన ఫొటోలు, తన భర్తతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా లావణ్య ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఈమె తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శనం అనంతరం అక్కడ ఉండే గోమాతలకు ఆహారం(గడ్డి) పెడుతున్న పిక్‌ను షేర్ చేస్తూ..‘ఈ క్యూటీస్ అన్నింటిని నాతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని ఉంది’ అనే క్యాప్షన్‌ని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వావ్ లావణ్య మంచి జంతు ప్రేమికురాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ సొట్టబుగ్గల చిన్నదాని పోస్టును ఓ సారి చూసేయండి.