అతనికి నా సర్వస్వం అర్పించాను కానీ, బ్రేకప్ తర్వాత అలా చేశాను.. విజయ్ దేవరకొండ బ్యూటీ సంచలన కామెంట్స్

by Kavitha |
అతనికి నా సర్వస్వం అర్పించాను కానీ, బ్రేకప్ తర్వాత అలా చేశాను.. విజయ్ దేవరకొండ బ్యూటీ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ స్టార్టింగ్ ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఏమైందో ఏమో వాళ్లతో బ్రేకప్ అయింది. ప్రజెంట్ మాత్రం హీరో ఆదిత్య రాయ్‌తో రిలేషన్‌లో ఉందనే వార్తలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా వీరిద్దరు పలు చోట్ల దర్శనం కూడా ఇచ్చారు. అయితే ప్రజెంట్ అతనితో కూడా బ్రేకప్ చెప్పుకున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బ్రేకప్ తర్వాత నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టాను. ఆ ఫొటోలు కాల్చిన తర్వాత చాలా బాధ తగ్గింది. రిలేషన్ షిప్‌లో నేను చాలా కాంప్రమైజ్ అయ్యాను, కానీ చెడ్డ వ్యక్తుల పట్ల మరీ అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు భాగస్వామిలో కేవలం మంచిని మాత్రమే చూశాను. అతని కోసం ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను.

నన్ను నేను మార్చుకున్నాను. మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం. ఇదే టైంలో ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పు లేదు. నేను భాగస్వామి నుంచి ఆశించినప్పుడు ఎదురుదెబ్బ తగిలింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed