‘నేను ఎప్పుడూ దానికోసమే ప్రయత్నిస్తా’.. అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-01-06 05:03:20.0  )
‘నేను ఎప్పుడూ దానికోసమే ప్రయత్నిస్తా’.. అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ చివరగా చేసిన చిత్రాలు అంతగా విజయం సాధించలేక పోయాయి. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను నా వృత్తిలో కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాను. పోషించే పాత్రల్ని ఎంపిక చేసుకోవడం మాత్రమే ముఖ్యం కాదు. అందులో జీవించడం చాలా కీలకం. నేను ఎప్పుడూ దానికోసమే ప్రయత్నిస్తా. ప్రస్తుతం నాకు వస్తున్న వరుస అవకాశాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మరింత వైవిధ్యమైన పాత్రలను, కథలను అన్వేషిస్తూ తెరపై నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి ఎదురుచూస్తున్న’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story