Nidhhi Agerwal : నేను అలాంటి బ్యాచ్‌కు చెందిన దాన్ని కాదు.. ‘రాజాసాబ్’ హీరోయిన్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-12-04 16:28:09.0  )
Nidhhi Agerwal : నేను అలాంటి బ్యాచ్‌కు చెందిన దాన్ని కాదు.. ‘రాజాసాబ్’ హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘రాజాసాబ్’ (Rajasab), పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆస్క్ నిధి పేరుతో నెటిజనులతో చాట్ చేసింది. ఇందులో భాగంగా పర్సనల్ (personal), కెరీర్ (career) విషయాలపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక రాజాసాబ్ షూటింగ్ గురించి చెప్పమని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. రాజాసాబ్ సినిమా సెట్‌లో ఎంతో సరదాగా పనిచేశాము. ఈ మూవీ టీమ్‌లో ఎంతో డెడికేషన్ ఉంది’ అన తెలిపింది నిధి. ఇక పవన్ కల్యాణ్ గురించి చెప్తూ.. ‘పవన్ కల్యాణ్‌తో రీసెంట్‌గా ఓ సెల్ఫీ తీసుకున్నాను. ఆ సెల్ఫీని త్వరలోనే పోస్ట్ చేసి మీ అందరితో పంచుకుంటాను’ చెప్పింది.

అలాగే.. తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చని, కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్ కాదని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది తన రెండు మూవీస్ రాజాసాబ్, హరిహర వీరమల్లు రిలీజ్ అవుతాయని, ఆ రెండు సినిమాలతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. ఈ రెండు మూవీస్‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ మూవీ కూడా ఉందని తెలిపిన నిధి ఆ సినిమా ఏంటనేది మాత్రం తెలపలేదు. కాగా.. ప్రజెంట్ వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More...

Nidhi Agarwal: ఆ బ్యాచ్ కాదంటూ నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్..!

Advertisement

Next Story