Kayyadu Lohar: సొంతంగా మీమ్స్ క్రియేట్ చేసుకుంటున్న యంగ్ బ్యూటీ.. పరువు తీసేసిన స్టార్ హీరో

by sudharani |
Kayyadu Lohar: సొంతంగా మీమ్స్ క్రియేట్ చేసుకుంటున్న యంగ్ బ్యూటీ.. పరువు తీసేసిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) యంగ్ హీరోయిన్ కయ్యదు లోహర్ (Kayyadu Lohar) ‘డ్రాగన్’ (Dragon) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌(Overnight Star)గా మారిపోయింది. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌(Blockbuster hit)గా నిలిచింది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు (box office) వద్ద సంచలనం సృష్టిస్తోంది. దీంతో కయ్యదు గ్రాఫ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌(Tollywood)లోనూ పెరిగిపోవడంతో.. వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇదిలా ఉంటే.. ‘డ్రాగన్’ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌‌(Promotions)లో పాల్గొన్నారు మూవీ టీమ్.

ఈక్రమంలో యాంకర్ మంజూష (Manjusha) హీరో ప్రదీప్ రంగనాథన్, కయ్యదు లోహర్‌ను ఒకరి ఫోన్లు ఒకరు మార్చుకోవాలని చెబుతుంది. దీంతో నా ఫోన్‌లో ఏం ఉండదు అంటూ కయ్యదు తన ఫోన్‌ను ప్రదీప్‌కు ఇస్తుంది. అప్పుడు ‘నీ ఫోన్‌లో ఒక డిఫరెంట్ యాప్ కనిపిస్తుంది.. మీమ్స్ క్రియేషన్ యాస్ ఆ’ అంటాడు ప్రదీప్. దీంతో ‘ఏంటా డిఫరెంట్.. షటప్.. ఆ యాప్ గురించి మాట్లాడకు’ అని నవ్వుతూ కయ్యదు రిప్లై ఇస్తుంది. అయినా వినకుండా ఆ యాప్‌లో ఉన్నది డైరెక్టర్ అశ్వత్ మారిమత్తు(Ashwath Marimathu)కు చూపిస్తూ.. ‘రాబోయే రోజుల్లో తెలుగులో కయ్యదు లోహర్ టాప్ హీరోయిన్’ అన్నట్లుగా మీమ్ క్రియేట్ చేసి ఉంటోంది. ‘నువ్వు నీ మీమ్స్‌ను సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నావా.. నువ్వే మీమ్స్ క్రియేట్ చేసుకుని మీమ్స్ పేజీల్లో పెట్టిస్తున్నావా’ అంటూ అందరి ముందు పరువు తీసేస్తాడు హీరో ప్రదీప్. దానికి ‘ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ (నువ్వు సాధించేవరకు అబద్దంలా అయినా చూపించాలి)’ అంటూ ఆన్సర్ ఇస్తుంది ఈ బ్యూటీ.

Next Story

Most Viewed