Ajith: ‘ఇకపై ఇలాంటివాటిని ప్రోత్సహించొద్దు.. వర్క్‌తో ముందుకుసాగండి’: స్టార్ హీరో

by Anjali |   ( Updated:2024-12-11 05:32:03.0  )
Ajith: ‘ఇకపై ఇలాంటివాటిని ప్రోత్సహించొద్దు.. వర్క్‌తో ముందుకుసాగండి’: స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో అజిత్(Ajith) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈ నటుడు మాగిజ్ తిరుమేని(Magij Thirumeni) దర్శకత్వం వహిస్తోన్న ‘విదా ముయార్చి’(Vida Muarchi) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ కథానాయిక త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించగా.. దేవీశ్రీ ప్రసాద్(Devishri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా అజిత్ ఓ ఇంటర్వ్యూలో పలు కామెంట్లు చేశారు. పలువురు ఫ్యాన్స్ ఈ హీరోను దేవుడని పిలుస్తున్నారని.. ఆ పిలుపు తనకు కంఫార్ట్‌గా లేదని వెల్లడించారు. పబ్లిక్‌లో ఎక్కడ కనిపించినా.. కడవులే అజిత్(Kadavule Ajith) అని స్లోగన్స్ చేయడం తనకేంతో ఇబ్బందిగా ఉందని తెలిపారు.

ఈ హీరో పేరుకు ఇతర బిరుదులను యాడ్ చేయడం తనకు ఏ మాత్రం నచ్చట్లేదని డైరెక్ట్‌గా చెప్పేశారు. కాగా వేరే వాళ్లకు ఇబ్బంది పెట్టకండని రిక్వెస్ట్ చేశారు. కష్టపడి పని చేస్తూ ముందుకు సాగండని.. ఇకపై ఇలాంటివి అస్సలు ప్రోత్సహించవద్దని తెలిపారు. చివరకు మీ కుటుంబాన్ని ప్రేమించండని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హీరో అజిత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో ఒకసారి కూడా ఈ హీరో స్టార్ ట్యాగ్స్ తగిలించవద్దని రిక్వెస్ట్ చేసినట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. పేరుతో పిలవండి లేకపోతే.. ఏకే అని పిలవమని అన్నారని జనాలు చర్చించుకున్నారు.

Advertisement

Next Story