- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SMAT : పృథ్వీషా, రహానే, దూబే విధ్వంసం.. టీ20లో ప్రపంచ రికార్డు నమోదు

దిశ, స్పోర్ట్స్ : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబాయి జట్టు ఘన విజయం సాధించింది. తద్వార సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబాయి ఆటగాళ్లు పృథ్వీ షా, రహానే, దూబేలు విధ్వంస ఇన్నింగ్స్‌లు ఆడటంతో విదర్భ నిర్ధేశించిన 222 టార్గెట్‌ను కేవలం 19. 2 ఓవర్లలోనే ముంబాయి చేధించింది. టీ20ల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ముంబాయి రికార్డు సృష్టించింది. అంతకు ముందు 2010లో ఫైసల్ బ్యాంక్ టీ20 కప్‌లో కరాచి డాల్ఫిన్స్, రావల్పిండి రామ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని చేధించగా అదే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ముంబాయి బ్యాట్స్‌మెన్లలో అజింక్య రహానే 45 బంతుల్లో 84 పరుగులు చేసి అదరగొట్టాడు. పృథ్వీ షా 26 బంతుల్లో 49 చేసి రాణించగా చివర్లో శివమ్ దూబే 22 బంతుల్లో 37, సూర్యాన్ష్ షెడ్గే 12 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 17వ ఓవర్లో షెడ్గే 6,6,6,4 బాది 22 పరుగులు రాబట్టాడు. అంతకు ముందు విదర్భ జట్టులో అథర్వ తైడే 41 బంతుల్లో 66, అపూర్వ వాంఖడే 33 బంతుల్లో 51 పరుగులు చేసి రాణించారు.