- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BWF World Tour Finals : త్రిషా-గాయత్రి ఓటమితో ప్రారంభం
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రిషా జాలీ - గాయత్రి ఓటమి పాలయ్యారు. బుధవారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్టులు చైనాకు చెందిన టాప్ ర్యాంక్ ప్లేయర్లు లూ షెంగ్ షూ-టాన్ జింగ్ చేతిలో ఈ జంట ఓడింది. ఈ మ్యాచ్‌లో 20-22, 22-20, 21-14 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది. తొలి గేమ్‌ను భారత జోడీ 22-20తో దక్కించుకుంది. అనంతరం పుంజుకున్న చైనా జోడీ రెండో గేమ్‌ను 22-20తో తమ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చైనా జోడీ తొలి నుంచి ఆధిపత్యం చెలాయించింది. 11-5తో లీడ్‌లోకి వెళ్లిన లూ షెంగ్ షూ-టాన్ జింగ్ జంట 21-14తో థర్డ్ గేమ్‌ను ముగించి విజయం సాధించింది. త్రిషా-గాయత్రి జోడీ తమ తదుపరి మ్యాచ్‌లో మలేషియాకు చెందిన పెర్లీ టన్- తిన్నా మురళీధరన్‌తో తలపడనున్నారు. అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డిల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరిన జోడీగా త్రిషా-గాయత్రి నిలిచారు.