- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gold: మళ్లీ రూ. 80 వేల మార్కు దాటిన బంగారం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.870 పెరిగి రూ.80,000కు చేరువైంది. అయితే వెండి ధరలు కిలోకు రూ. 1,000 తగ్గి రూ.1,03,000 వద్ద పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో పాటు రూపాయి మారకం విలువ పతనం ఇందుకు కారణం. వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి పెరిగిన కొనుగోళ్లతో పసిడి ధరలు రికార్డు గరిష్టాలకు పెరుగుతున్నాయి. స్థానిక మార్కెట్లలోనూ నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. వరుసగా మూడో రోజు ర్యాలీ చేసిన ధరల కారణంగా ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 800 పెరిగి రూ. 72,850 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్‌కు 10.20 డాలర్లు పెరిగి 2,728.60 డాలర్లకు చేరుకుంది. 'సిరియాలో పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్ బలపడటం, రేట్ల తగ్గింపుపై పెరుగుతున్న అంచనాల కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయని' మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మానవ్ మోడీ తెలిపారు.