- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Tention: అటు తాత, ఇటు భార్య... ఎటూ తేల్చుకోలేకపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఓటు ఎవరికో..?
దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. దీంతో ఆయన తర్జన భర్జన అవుతున్నారు. ఎటు తేల్చుకోలేక డైలమాలో పడ్డారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలా అని జూనియర్ ఆగం ఆగం అవుతున్నారట...
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఆయన పేరుతో అవార్డులు ఇస్తున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి రావాలని నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఆహ్వానమే జూనియర్ ఎన్టీఆర్‌ను చిక్కులో పడేలా చేసింది.
ఈ నెల 20న హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. సరిగ్గా అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి రోజు. దీంతో భార్య కోరిక మేరకు మల్దీవుల టూర్‌కు ప్లాన్ చేశారట. కుటుంబం మొత్తం అక్కడి వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. వెకేషన్‌కు సంబంధించిన బుకింగ్స్ కూడా పూర్తి చేశారట. అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానం రాకముందే ప్లాన్ చేసుకున్నారట.
ఇప్పుడు ఆహ్వానం అందటంతో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వెళ్లాలా..?. లేదంటే భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలా అనే సంశయంలో జూనియర్ ఎన్టీఆర్ పడ్డారట. ఇటు చూస్తే తాత.. అటు భార్య కోరిక.. ఈ రెండింటిలో దేనికి ప్రిపరెన్స్ ఇవ్వాలనేది తెలియక జూనియర్ ఎన్టీఆర్ తలపట్టుకుంటున్నారట. మరి భార్య కోరికకు గౌరవం ఇచ్చి మల్దీవ్‌లకు వెళ్తాడా..?. తనకు దేవుడితో సమానమైన తాత కోసం శయంతి ఉత్సవాలకు వస్తాడా అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయంపై అటు అభిమానులు మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మహేష్ బాబుకు ‘బిచ్చగాడు’ బాగా సెట్ అవుతుంది : విజయ్ ఆంటోని
బ్రా వేసుకోకుండా డ్యాన్స్ చేసిన నటి.. క్లాస్ పీకిన పేరెంట్స్