- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
NTR War-2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను గుడ్ న్యూస్.. వార్-2 రిలీజ్ డేట్ ఫిక్స్!

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇటీవల ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అందుకున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్(Prashant Neel)తో ఓ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ‘వార్-2’ (War-2) మూవీతో బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకోగా మూవీ రిలీజ్ కోసం బాలీవుడ్ సినీ ప్రియులతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
అయితే.. ఈ సినిమా రిలీజ్‌పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా(Social media)లో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ‘వార్-2’ పోస్ట్ పోన్ అయినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వార్-2 రిలీజ్‌పై లేటెస్ట్ అప్‌డేట్ (Latest update) వచ్చింది. ఈ సినిమా షెడ్యూల్ (Schedule) ప్రకారం ఆగస్టు -14 న గ్రాండ్‌గా థియేటర్‌లలో ‘వార్-2’ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ డేట్‌నే ఫైనల్ చేస్తూ త్వరలో దీనిపై అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు సినిమా విశ్లేషకుల నుంచి సమాచారం.